బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Sep 16, 2020 , 10:30:39

చైనా స‌రిహ‌ద్దులో చొర‌బాట్లు జ‌ర‌గ‌లేదు: కేంద్ర‌ హోంశాఖ‌

చైనా స‌రిహ‌ద్దులో చొర‌బాట్లు జ‌ర‌గ‌లేదు:  కేంద్ర‌ హోంశాఖ‌

హైద‌రాబాద్‌: చైనా స‌రిహ‌ద్దుల్లో గ‌త ఆరు నెల‌ల నుంచి ఎటువంటి చొర‌బాట్లు జ‌ర‌గ‌లేద‌ని ఇవాళ కేంద్ర హోంశాఖ ప్ర‌క‌ట‌న చేసింది.  రాజ్య‌స‌భ‌కు ఇవాళ హోంశాఖ ఈ విష‌యాన్ని చెప్పింది.  ఇండో-చైనా బోర్డ‌ర్‌లో అక్ర‌మంగా ఎవ‌రూ భార‌త్‌లోకి ప్ర‌వేశించ‌లేద‌ని కేంద్ర హోంశాఖ వెల్ల‌డించింది. వాస్తవానికి రెండు దేశాల మ‌ధ్య ల‌డాఖ్‌లో గ‌త కొన్నాళ్లుగా ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. జూన్ 15వ తేదీన గాల్వ‌న్ లోయ‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ త‌ర్వాత‌.. రెండు దేశాల మ‌ధ్య ప‌రిస్థితి సున్నితంగా మారింది. ఉద్రిక్త‌త‌ల‌ను త‌గ్గించేందుకు సైనిక‌, దౌత్య చ‌ర్చ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి.

రాజ్య‌స‌భ ఎంపీ డాక్ట‌ర్ అనిల్ అగ‌ర్వాల్ వేసిన ప్ర‌శ్న‌కు .. కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి నిత్యానంద రాయ్ స‌మాధానం ఇచ్చారు.  ఇండో చైనా బోర్డ‌ర్‌లో ఆరు నెల‌ల‌గా చొర‌బాట్లులేవ‌ని ఆయ‌న తెలిపారు.  అయితే దీనిపై పూర్తి వివ‌ర‌ణ ఆయ‌న ఇవ్వ‌లేదు. కానీ పాకిస్థాన్ నుంచి గ‌త ఆరు నెల‌ల్లో 47 సార్లు చొర‌బాటు జ‌రిగిన‌ట్లు మంత్రి తెలిపారు. చైనాపై ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ ప్ర‌క‌ట‌న‌తో సంబంధం లేకుండా హోంశాఖ మంత్రి స‌మాధానం ఉంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.


logo