గురువారం 02 జూలై 2020
National - Jun 18, 2020 , 17:10:29

గాల్వ‌న్‌లో సైనికులెవ్వ‌రూ మిస్‌కాలేదు : ఇండియ‌న్ ఆర్మీ

గాల్వ‌న్‌లో సైనికులెవ్వ‌రూ మిస్‌కాలేదు : ఇండియ‌న్ ఆర్మీ

హైద‌రాబాద్‌: గాల్వ‌న్ వ్యాలీలో అమ‌రులైన జ‌వాన్ల సంఖ్య స‌రిగానే ఉంద‌ని ఇవాళ భార‌త ఆర్మీ స్ప‌ష్టం చేసింది.  కొంద‌రు సైనికులు మిస్స‌వుతున్న‌ట్లు న్యూయార్క్ టైమ్స్‌లో వ‌చ్చిన ఓ వార్తా క‌థ‌నాన్ని.. భార‌తీయ సైన్యం కొట్టిపారేసింది.  చైనా సైనికుల‌తో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో.. భార‌తీయ సైనికులు ఎవ‌రూ గ‌ల్లంతు కాలేద‌ని ఆర్మీ స్ప‌ష్టం చేసింది.  దీనికి సంబంధించిన పూర్తి వివ‌ర‌ణ ఆర్మీ త్వ‌ర‌లో రిలీజ్ చేయ‌నున్న‌ది. గాల్వ‌న్ వ్యాలీలో చైనా సైనికుల‌తో జ‌రిగిన హింసాత్మ‌క ఘ‌ర్ష‌ణ‌లో.. 20 మంది భార‌తీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ‌‌కు చెందిన క‌ల్న‌ల్ సంతోశ్‌బాబు కూడా ఆ బృందంలో ఉన్నారు.  

చైనా సైనికుల‌తో ఘ‌ర్ష‌ణ జ‌రిగిన స‌మ‌యంలో భార‌త బ‌ల‌గాలు ఉత్త చేతులో వెళ్లిన‌ట్లు రాహుల్ గాంధీ చేసిన ఆరోప‌ణ‌ల‌పై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంక‌ర్ స్పందించారు. పెట్రోలింగ్‌కు వెళ్లిన స‌మ‌యంలో సైనికుల వ‌ద్ద ఆయుధాలు ఉన్న‌ట్లు ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా వెల్ల‌డించారు. 


logo