శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 16:32:46

ఈ ఏడాది ఫీజుల్లో ఎలాంటి పెంపు లేదు : ఎన్‌ఎస్‌యూటీ

ఈ ఏడాది ఫీజుల్లో ఎలాంటి పెంపు లేదు : ఎన్‌ఎస్‌యూటీ

న్యూ ఢిల్లీ : ఈ సంవత్సరం ఫీజుల పెంపు ప్రకటించలేదని నేతాజీ సుభాష్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఎస్‌యూటీ) సోమవారం స్పష్టం చేసింది. వర్సిటీ డీన్, ప్రొఫెసర్ సుజాతా సెంగర్ జాతియ మీడియాతో మాట్లాడుతూ మొత్తం కోర్సు ఫీజు వివరాలను అకాడమిక్‌ ఇయర్‌ ప్రారంభంలోనే విద్యార్థులకు తెలియజేశామన్నారు. "విద్యార్థుల ప్రకటన పూర్తిగా తప్పు. ఈ ఏడాది ఎలాంటి ఫీజులు పెంచలేదు. విద్యార్థులకు వర్తించే ఫీజు వివరాలను ఇప్పటికే వారికి తెలియజేశాం’’ అని సెంగర్‌ పేర్కొన్నారు.

జూలై 21 నుంచి కొనసాగుతున్న ఎన్‌ఎస్‌యూటీ అకాడెమిక్ సెషన్‌కు ఫీజు వివరాలతో కూడిన నోటీసును యాజమాన్యం విడుదల చేసింది. నోటీసు ప్రకారం విద్యార్థులు జూలై 31లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్యంగా చెల్లిస్తే జరిమానా విధిస్తామని తెలిపింది.  ఆ తరువాత ఫీజు సడలింపు కోరుతూ ఎన్‌ఎస్‌యూటీ విద్యార్థులు ఆందోళన ప్రారంభించారు.  కరోనావైరస్ కారణంగా చాలా కుటుంబాల ఆర్థిక స్థితి దెబ్బతిన్నదని ఈ సమయంలో అధిక ఫీజులు చెల్లించే పరిస్థితి లేదని, ఇప్పటికే యూనివర్సిటీ వివిధ కార్యకలాపాల పేరుతో అధిక మొత్తంలో డబ్బు వసూలు చేస్తోందని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఫీజుల్లో ఎలాంటి పెంపు చేయలేదని సోమవారం ఎన్‌ఎస్‌యూటీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo