బుధవారం 02 డిసెంబర్ 2020
National - Aug 16, 2020 , 15:28:11

ఈ ఏడాది ఇంట్లోనే గ‌ణేశుని నిమ‌జ్జ‌నం

ఈ ఏడాది ఇంట్లోనే గ‌ణేశుని నిమ‌జ్జ‌నం

న్యూఢిల్లీ: క‌రోనా నేప‌థ్యంలో ఈఏడాది గ‌ణేశున్ని నిమ‌జ్జ‌నం ఇండ్ల‌లోనే చేసుకోవాల‌ని ఢిల్లీ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు సూచించింది. నిమజ్జ‌‌నానికి ప్ర‌జ‌లు భారీగా గుమికూడే అవ‌కాశం ఉండ‌టంతో క‌రోనా వైర‌స్ మ‌రింత‌గా వ్యాప్తి చెందుతుంద‌ని, దీంతో దేశ రాజ‌ధానిలో బ‌హిరంగ ప్ర‌దేశాల్లో గ‌ణేశుని నిమజ్జ‌‌నానికి అనుమ‌తిలేద‌ని ఢిల్లీ పొల్యూష‌న్ కంట్రోల్ క‌మిటీ వెల్ల‌డించింది. నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించిన‌వారికి రూ.50 వేలు ఫైన్ విధిస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఈ నెల 22న విన‌య‌క చ‌వితి జ‌ర‌గ‌నుంది.

2015లో జాతీయ హ‌రిత ట్రిబ్యున‌ల్ తీర్పు ప్ర‌కారం య‌మునా న‌దిలో విగ్ర‌హాల‌ను నిమ‌జ్జ‌నం చేయ‌డంపై నిషేధం అమ‌ల్లో ఉన్న‌ది. దీంతో ఢిల్లీ ప్ర‌భుత్వం న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల్లో కృత్రిమంగా చిన్న చిన్న  కుంట‌ల‌ను ఏర్పాటు చేసింది. అయితే క‌రోనా నేప‌థ్యంలో ఈ ఏడాది కృత్రిమ చెరువుల్లో కూడా విగ్ర‌హాల‌ను నిమ‌జ్జ‌నం చేయడానికి అనుమ‌తి లేద‌ని ప్ర‌భుత్వం తెలిపింది. దీంతో కాల‌నీవాసులు, అపార్టుమెంట్ల వాసులు త‌మ ఇండ్ల‌లోనే చిన్న తొట్లు లేదా బ‌కెట్ల‌లో విగ్ర‌హాల‌ను నిమ‌జ్జనం చేసుకోవాని సూచించింది.