శనివారం 16 జనవరి 2021
National - Dec 04, 2020 , 19:27:10

బైక‌ర్ల‌కు నో హెల్మెట్, నో ఫ్యూయ‌ల్ రూల్‌

బైక‌ర్ల‌కు నో హెల్మెట్, నో ఫ్యూయ‌ల్ రూల్‌

కోల్‌క‌తా: ప‌శ్చిమ‌బెంగాల్ రాజ‌ధాని కోల్‌క‌తాలో ద్విచ‌క్ర వాహ‌న‌దారులు పెట్రోల్ బంకుల్లో హెల్మెట్ ధ‌రించేలా చేయ‌డం కోసం కొత్త నిబంధ‌న తీసుకురానున్నారు. హెల్మెట్ ధ‌రించిన వారికే ఇంధ‌నం పోసేలా నో హెల్మెట్.. నో ఫ్యూయ‌ల్ నిబంధ‌న విధించాల‌ని అక్క‌డి అధికారులు నిర్ణ‌యించారు. 2020, డిసెంబ‌ర్ 8 నుంచి 2021, ఫిబ్ర‌వ‌రి 5  వ‌ర‌కు ఈ నిబంధ‌న అమ‌ల్లో ఉంటుంద‌ని తెలిపారు. క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ‌ నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు.     

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.