గురువారం 09 జూలై 2020
National - Jun 23, 2020 , 16:52:38

ఈ ఏడాది హజ్‌ యాత్ర ఉండదు : కేంద్ర మంత్రి ముక్తార్‌

ఈ ఏడాది హజ్‌ యాత్ర ఉండదు : కేంద్ర మంత్రి ముక్తార్‌

న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకు కరోనా వైరస్‌ ఉదృతి పెరుగుతోంది. ఇప్పటికే భారత్‌లోని కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నాయి. కొవిడ్‌ కేసులు విపరీతంగా పెరుతున్న క్రమంలో ఈ ఏడాది భారత్‌ నుంచి హజ్‌ యాత్ర ఉండదని కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ ప్రకటించారు. హజ్‌యాత్ర కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి డబ్బులు వెనక్కి ఇస్తామని ఆయన తెలిపారు.

ఇప్పటి వరకు అనుమతి లభించిన వారు 2021లో దానిని వినియోగించుకోవచ్చని తెలిపారు. సౌది అరేబియలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.


logo