మంగళవారం 19 జనవరి 2021
National - Dec 28, 2020 , 21:50:10

బీజేపీ, జేజేపీ నేతలను బహిష్కరించిన హర్యానా గ్రామస్తులు

బీజేపీ, జేజేపీ నేతలను బహిష్కరించిన హర్యానా గ్రామస్తులు

చండీగఢ్‌: హర్యానాలోని అధికార బీజేపీ, జననాయక్‌ జనతా పార్టీ (జేజేపీ) నేతలను కర్నాల్‌లోని ఖదీరాబాద్‌ గ్రామస్తులు బహిష్కరించారు. వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో నెల రోజులకుపైగా నిరసనలు చేస్తున్న రైతులకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి చెందిన సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌, జేజేపీకి చెందిన డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలతోసహా రెండు పార్టీల నేతలను గ్రామంలోకి అనుమతించబోమని చెప్పారు. ఒక వేళ మీరు మా గ్రామంలోకి వస్తే పూల దండలకు బదులుగా చెప్పుల దండలతో స్వాగతం పలుకుతాం అంటూ బ్యానర్‌ ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రైతులకు మద్దతుగా మాట్లాడే వారినే గ్రామంలోకి అనుమతిస్తామని ఆ బ్యానర్‌లో పేర్కొన్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.