సోమవారం 30 మార్చి 2020
National - Feb 20, 2020 , 12:38:45

ఉప‌హార్ విషాదం.. ఓన‌ర్ల‌కు జైలుశిక్ష పెంచేదిలేద‌న్న సుప్రీం

ఉప‌హార్ విషాదం.. ఓన‌ర్ల‌కు జైలుశిక్ష పెంచేదిలేద‌న్న సుప్రీం

హైద‌రాబాద్‌:  ఉప‌హార్ థియేట‌ర్ ప్ర‌మాదానికి సంబంధించిన కేసును పున‌ర్ విచారించాల‌ని దాఖ‌లు చేసిన క్యూరేటివ్ పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు తిర‌స్క‌రించింది. 1997లో ఢిల్లీలోని ఉప‌హార్ థియేట‌ర్‌లో జ‌రిగిన అగ్ని ప్ర‌మాదం వ‌ల్ల 59 మంది మృతిచెందారు.  యాజ‌మాన్యం నిర్ల‌క్ష్యం వ‌ల్ల ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు బాధిత కుటుంబాలు కోర్టులో కేసు వేశాయి. అయితే ఈ కేసులో థియేట‌ర్ ఓన‌ర్లు సుశీల్ అన్స‌ల్‌, గోపాల్ అన్స‌ల్‌కు జైలుశిక్ష‌ను మ‌రింత కాలం పెంచాల‌ని తాజా కోర్టును కోరారు.  ఆ పిటిష‌న్‌లో ఎటువంటి మెరిట్ లేద‌ని కోర్టు చెప్పింది.  చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే, జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌, అరుణ్ మిశ్రాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ తీర్పును ఇచ్చింది.  30 కోట్ల జ‌రిమానా ష‌ర‌తుపై 2015లో అన్స‌ల్ సోద‌రులు జైలు నుంచి రిలీజయ్యారు.  


logo