విదేశీ వద్దు స్వదేశీనే ముద్దు

ఇకపై స్వదేశీనే వాడతాం
కొత్త సంవత్సరం రోజు ప్రతిజ్ఞ తీసుకోండి
మన్ కీ బాత్‌లో ప్రధాని
న్యూఢిల్లీ: విదేశీ వస్తువులకు బదులుగా స్వదేశీ వస్తువులనే వాడాలని, ఈ మేరకు భారతీయులంతా కొత్త సంవత్సరం నాడు ప్రతిజ్ఞ తీసుకోవాలని ప్రధాని మోదీ కోరారు. ఆదివారం ‘మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా సందేశాన్నిచ్చారు. ఈ ఏడాదిలో ఇదే చివరి ‘మన్ కీ బాత్' కార్యక్రమం. వోకల్ ఫర్ లోకల్ నినాదానికి అనూహ్య మద్దతు లభించిందని, ఒక్క ఏడాదిలోనే ప్రజల్లో చాలా మార్పు వచ్చిందని చెప్పారు. చాలా చోట్ల ప్రజలు స్వదేశీ వస్తువులను అడిగి మరీ కొంటున్నారని అన్నారు. కశ్మీర్ కుంకుమపువ్వును అంతర్జాతీయ బ్రాండ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. గురుగోబింద్ సింగ్ కుమారులు సహా సిక్కు మతగురువులకు మోదీ ఈ సందర్భంగా నివాళులర్పించారు. వారి త్యాగాల వల్లే మన సంస్కృతి మనగలిగిందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వన్యప్రాణి సంరక్షణ గురించి మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు. 2014-18 మధ్య కాలంలో దేశంలో చిరుతల సంఖ్య 7,900 నుంచి 12,852కు పెరిగిందని చెప్పారు.
తాజావార్తలు
- రద్దు చేసిన రైళ్ల పునరుద్ధరణ
- మేడారం మినీ జాతరకు ప్రత్యేక బస్సులు
- అంగన్వాడీల సేవలు మరింత విస్తరణ
- దేశంలోనే తెలంగాణ పోలీస్ అగ్రగామి
- మామిడి విక్రయాలు ఇక్కడే
- దేశవ్యాప్తంగా ‘డిక్కీ’ని విస్తరిస్తాం
- కొత్తపుంతలు తొక్కుతున్న వస్త్రపరిశ్రమ
- మాల్దీవులలో చిల్ అవుతున్న యష్ ఫ్యామిలీ
- ‘ఐసెట్ కౌన్సెలింగ్‌పై రెండ్రోజుల్లో తేల్చండి’
- రూ.19 కోట్లు.. 5 కి.మీ.