ఆదివారం 01 నవంబర్ 2020
National - Sep 18, 2020 , 02:55:57

గస్తీని ఏ శక్తీ ఆపలేదు: రాజ్‌నాథ్‌సింగ్

గస్తీని ఏ శక్తీ ఆపలేదు: రాజ్‌నాథ్‌సింగ్

న్యూఢిల్లీ: దేశ సరిహద్దులోని లఢక్‌ ప్రాంతంలో భారత సైనికులు గస్తీ నిర్వహించకుండా ప్రపంచంలోని ఏ శక్తీ ఆపలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టంచేశారు. తూర్పు లఢక్‌లో నెలకొన్న పరిస్థితులపై గురువారం రాజ్యసభలో ఆయన ప్రకటన చేశారు. సరిహద్దులో చైనా పెద్ద ఎత్తున సైనికులను మోహరించిందని, అందుకు ప్రతిస్పందనగా భారత్‌ సైతం భారీగా బలగాలను మోహరించినట్లు చెప్పారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరువైపులా చర్చలు కొనసాగుతున్న వేళ, ఆగస్టు 29-30 మధ్యన దక్షిణ పాంగాంగ్‌లో చైనా సైన్యం ఆక్రమణకు యత్నించిందని తెలిపారు. భారత్‌, చైనా మధ్య సంప్రదాయ సరిహద్దును చైనా అంగీకరించడం లేదని రాజ్‌నాథ్‌ చెప్పారు.