ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 05, 2020 , 01:40:50

కోల్‌కతాకు విమానాలు బంద్‌

కోల్‌కతాకు విమానాలు బంద్‌

  • ఆరు నగరాల నుంచి రాకపోకలపై నిషేధం

కోల్‌కతా: కరోనా నియంత్రణలో భాగంగా ఈ నెల 6 నుంచి 19 తేదీల మధ్య ఢిల్లీతో సహా ఆరు నగరాల నుంచి విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు శనివారం తెలిపారు. ఢిల్లీ, ముంబై, పుణె, నాగ్‌పూర్‌, చెన్నై, అహ్మదాబాద్‌ నగరాల నుంచి రెండు వారాల పాటు విమాన సర్వీసులను నిలిపివేయాలని గత నెల 30న పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖకు కేంద్ర పౌర విమానయానశాఖ ఆమోదం తెలిపింది. ఇండోర్‌, సూరత్‌ నుంచి విమానాలను అనుమతించొద్దని పౌర విమానయాన శాఖ కార్యదర్శికి బెంగాల్‌ ప్రభుత్వం లేఖ రాసింది. 


logo