శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 05, 2020 , 14:54:45

ఆస్ట్రేలియాకు ‘వందే భారత్‌’ విమానాలు వాయిదా

ఆస్ట్రేలియాకు ‘వందే భారత్‌’ విమానాలు వాయిదా

న్యూ ఢిల్లీ: కొవిడ్‌-19 కారణంగా ఆంక్షలు విధించినందున ఈ నెల 4 నుంచి 14వ తేదీ వరకు ఆస్ట్రేలియాకు షెడ్యూల్‌ చేసిన ‘వందే భారత్‌ మిషన్‌’ విమానాలు వాయిదాపడ్డాయి. ఆస్ట్రేలియాలో అంతర్జాతీయ విమానాలపై ఇటీవల విధించిన కొవిడ్‌-19 సంబంధిత ఆంక్షల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్‌ ఇండియా అధికారులు తెలిపారు. వందేభారత్‌ మిషన్‌ తర్వాతి ఫేస్‌లో ఆస్ట్రేలియా నుంచి ఈ విమానాలను రీషెడ్యూల్‌ చేస్తామని స్పష్టం చేశారు. రీ షెడ్యూల్‌ చేసిన విమానాలన్నీ ఈ నెల 15 తర్వాత నడుస్తాయని పేర్కొన్నారు. 

గత నెల చివరలో, వందే భారత్ మిషన్ కింద ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఎనిమిది విమానాలను నడిపేందుకు ఎయిర్‌ ఇండియా షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ నెల 1 నుంచి 14 వరకు ఈ విమానాలు నడపాల్సి ఉంది. వందే భారత్ మిషన్ నాలుగో ఫేస్‌ ఈ నెల 3 నుంచి ప్రారంభమైంది. విదేశాంగ వ్యవహారాల శాఖ సమాచారం ప్రకారం ఇప్పటివరకూ 700కు పైగా విమానాల ద్వారా 1.50 లక్షల మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చారు.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo