బుధవారం 03 జూన్ 2020
National - Apr 03, 2020 , 15:22:54

మహిళా పోలీసులు, నర్సులతో తబ్లిగీ సభ్యులు అసభ్య ప్రవర్తన

మహిళా పోలీసులు, నర్సులతో తబ్లిగీ సభ్యులు అసభ్య ప్రవర్తన

లక్నో : దేశంలో కరోనా వ్యాప్తికి ఢిల్లీలో నిర్వహించిన తబ్లిగీ జమాత్‌ ఈవెంట్‌ కారణమని కేంద్రంతో ఆయా రాష్ర్టాలు తేల్చిన విషయం విదితమే. మర్కజ్‌ భవన్‌లో నిర్వహించిన ప్రార్థనలకు హాజరై వెళ్లొచ్చిన వారికే కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. వీళ్లతో సన్నిహితంగా మెలిగిన వారికి కూడా కరోనా సోకింది. అయితే ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న తబ్లిగీ జమాత్‌కు చెందిన కొంతమంది సభ్యులు.. మహిళా పోలీసులు, నర్సులతో అసభ్యకరంగా ప్రవర్తించారు. బాధిత మహిళా పోలీసులు, నర్సులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘజియాబాద్‌ ఐసోలేషన్‌ వార్డులో పూర్తిగా పురుష సిబ్బందినే ప్రభుత్వం నియమించింది. 

అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై జాతీయ భద్రతా చట్టం(ఎన్‌ఎస్‌ఏ) కింద చర్యలు తీసుకుంటామని యోగి ప్రభుత్వం స్పష్టం చేసింది. చట్టం వారిని క్షమించదు అని సీఎం యోగి పేర్కొన్నారు. మహిళా పోలీసులు, నర్సులతో అసభ్యకరంగా ప్రవర్తించడం దారుణమైన నేరమని ఆయన అన్నారు. జమాత్‌ సభ్యులను వదిలిపెట్టం అని యోగి తేల్చిచెప్పారు. ఐసోలేషన్‌ వార్డుల్లో చికిత్స పొందుతున్న జమాత్‌ సభ్యులు నగ్నంగా తిరుగుతున్నారు. అసభ్యకరమైన పదజాలంతో నర్సులను వేధించారు. సిగరెట్లు, బీడీలు కావాలని ఆస్పత్రి సిబ్బందిని వేధిస్తున్నారు. 


logo