శనివారం 30 మే 2020
National - Mar 31, 2020 , 18:49:15

కరోనాపై ఏప్రిల్‌ ఫూల్‌ జోకులొద్దు..!

కరోనాపై ఏప్రిల్‌ ఫూల్‌ జోకులొద్దు..!

ముంబై:  ప్రతిఏడాది ఏప్రిల్‌ ఒకటవ తేదీ రాగానే  చాలా మంది  ఎదుటివారిని సరదాగా ఫూల్స్‌ చేయాలనుకుంటున్నారు. తమ కుటుంబసభ్యులు, స్నేహితులను తప్పుడు సమాచారంతో బోల్తా కొట్టించాలని చూస్తుంటారు. టెక్నాలజీ పెరగడం.. అందరూ సోషల్‌మీడియాను వినియోగిస్తుండటంతో తెలిసో తెలియకో ఇలా ఫేక్‌ న్యూస్‌ వార్తలు వైరల్‌ అవుతున్నాయి. సాధారణ ప్రజలకు ఏది నిజమో..ఏది అబద్ధమో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు  ప్రస్తుతం దేశమంతా లాక్‌డౌన్‌ పాటిస్తున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల పోలీసులు ముందే అప్రమత్తమయ్యారు.

దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 230 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  ఇలాంటి క్లిష్ట సమయంలో తప్పుడు సమాచారం వ్యాప్తితో ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన మహారాష్ట్ర ప్రభుత్వం   హెచ్చరికలు జారీ చేసింది.  ఏప్రిల్‌ ఫూల్‌ డే రోజున ఫేక్‌ న్యూస్‌ సర్య్యులేట్ కఠిన చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. 'కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించాం. ఇలాంటి సమయంలో ప్రజలను భయాందోళనకు గురిచేసేలా ఫేక్‌ మెసేజ్‌లను  షేర్‌ చేయకండి' అని రాష్ట్ర పౌరులను  ఆయన కోరారు. పుకార్లను వ్యాప్తి చేసేవారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆదేశించారు. 


logo