బుధవారం 03 మార్చి 2021
National - Jan 22, 2021 , 15:43:49

సివిల్ స‌ర్వీసెస్ అభ్య‌ర్థులకు మ‌రో ఛాన్స్ ఇవ్వం..

సివిల్ స‌ర్వీసెస్ అభ్య‌ర్థులకు మ‌రో ఛాన్స్ ఇవ్వం..

న్యూఢిల్లీ:  గ‌త ఏడాది కోవిడ్ మ‌హ‌మ్మారి వ‌ల్ల యూపీఎస్‌సీ ప‌రీక్ష‌ల‌కు హాజ‌రుకాలేక‌పోయిన సివిల్ స‌ర్వీసెస్ ప్రిలిమిన‌రీ అభ్య‌ర్థుల‌కు మ‌రో అవ‌కాశం ఇచ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం నిరాక‌రించింది. సుప్రీంకోర్టుతో ఇవాళ కేంద్రం ఈ విష‌యాన్ని చెప్పింది.  అడిష‌న‌ల్ సోలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ ఎస్‌వీ రాజు ప్ర‌భుత్వం త‌ర‌పున‌ కోర్టుకు ఈ విష‌యాన్ని విన్న‌వించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప‌ర్స‌న‌ల్ అండ్ ట్రైనింగ్ త‌ర‌పున ఆయ‌న వాదించారు.  జ‌స్టిస్ ఏఎం ఖాన్‌విల్క‌ర్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ఈ కేసును విచారిస్తున్న‌ది. సివిల్స్ అభ్య‌ర్థుల‌కు మ‌రో ఛాన్స్ ఇచ్చేందుకు తాము సిద్ధంగా లేమ‌ని, ఈ అంశంలో అఫిడ‌విట్ దాఖ‌లు చేసేందుకు త‌న‌కు స‌మ‌యం ఇవ్వాల‌ని అడిష‌న‌ల్ సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ రాజు కోర్టును కోరారు. ర‌చ‌నా సింగ్ అనే సివిల్స్ అభ్య‌ర్థి కోర్టులో కేసు దాఖ‌లు చేశారు. ఈ కేసులో తీర్పును 25వ తేదీన వినిపించ‌నున్నారు.   

VIDEOS

logo