శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 26, 2020 , 19:09:12

క‌మ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ లేదు : కేంద్ర ఆరోగ్య‌శాఖ‌

క‌మ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ లేదు :  కేంద్ర ఆరోగ్య‌శాఖ‌


హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ వ‌ల్ల క‌మ్యూనిటీ ట్రాన్స్‌మిష‌న్ జ‌ర‌గ‌డం లేద‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి ల‌వ్ అగ‌ర్వాల్ తెలిపారు.  వ్య‌క్తుల నుంచి స‌మూహానికి వైర‌స్ సోకుతున్న ఎటువంటి ఆధారాలు లేవ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.  ప్ర‌భుత్వం ఇచ్చిన సూచ‌న‌లు పాటిస్తే కమ్యూనిటీ ట్రాన్స్‌మిష‌న్ ఉండ‌ద‌న్నారు.  ఇవాళ మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ.. ఇండియాలో సోష‌ల్ డిస్టాన్సింగ్ పాటిస్తే.. వైర‌స్ వ్యాప్తి కాద‌న్నారు. గ‌త 24 గంట‌ల్లో దేశంలో 42 కొత్త క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయ‌ని, న‌లుగురు మృతిచెందిన‌ట్లు ఆయ‌న తెలిపారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 649కి చేరుకున్న‌ది. ప్రాథ‌మికంగా మాత్రం వైర‌స్ వ్యాప్తి నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. దోమ‌ల వ‌ల్ల వైర‌స్ వ్యాప్తి చెందుతుందా అన్న ప్ర‌శ్న‌ల‌ను ఆయ‌న కొట్టిపారేశారు. నూరు శాతం సామాజిక దూరాన్ని పాటిస్తే, క‌రోనా వైర‌స్ జీవిత‌ చ‌క్రాన్ని బ్రేక్ చేయ‌వ‌చ్చు అని ఆయ‌న చెప్పారు. 17 రాష్ట్రాలు కోవిడ్ పేషెంట్ల కోసం ప్ర‌త్యేక హాస్పిట‌ళ్లు ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. 


logo