శనివారం 04 జూలై 2020
National - Jul 01, 2020 , 13:30:42

క‌రోనిల్ ఔష‌ధం.. ఆయుష్‌తో విభేదాలు లేవ‌న్న ప‌తంజ‌లి

క‌రోనిల్ ఔష‌ధం.. ఆయుష్‌తో విభేదాలు లేవ‌న్న ప‌తంజ‌లి

హైద‌రాబాద్‌: కోవిడ్‌19 వ్యాధిగ్ర‌స్తుల చికిత్స కోసం కొరోనిల్ ఔష‌ధాన్ని క‌నుగొన్న‌ట్లు ప‌తంజ‌లి సంస్థ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ ఔష‌ధానికి ఆయుష్ మంత్రిత్వ‌శాఖ అనుమ‌తి లేద‌ని ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది.  ఈ నేప‌థ్యంలో ప‌తంజ‌లి వాటాదారుడు బాబా రాందేవ్ ఇవాళ మీడియాతో కొన్ని విష‌యాల‌ను పంచుకున్నారు.  తాము త‌యారు చేసిన క‌రోనిల్ ఔష‌ధాన్ని తీసుకున్న వారిలో 67 శాతం మంది కేవ‌లం మూడు రోజుల్లో కోలుకున్న‌ట్లు చెప్పారు. ఏడు రోజుల్లో నూరు శాతం కోట్లుకున్న‌ట్లు వెల్ల‌డించారు. దీనికి సంబంధించిన డేటాను ఆయుష్ మంత్రిత్వ‌శాఖ‌కు స‌మ‌ర్పించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. 

తాము చేసిన ట్ర‌య‌ల్స్‌లో 45 మంది రోగులు కోవిడ్ నెగ‌టివ్‌గా తేలిన‌ట్లు రాందేవ్ చెప్పారు.  ఆయుష్ మంత్రిత్వ‌శాఖ‌, ప‌తంజ‌లి మ‌ధ్య ఎటువంటి బేధాభిప్రాయం లేద‌న్నారు. దివ్య క‌రోనిల్ ట్యాబ్లెట్ల ఉత్ప‌త్తి, పంపిణీకి ఆయుష్ మంత్రిత్వ‌శాఖ నుంచి అనుమ‌తి వ‌చ్చిన‌ట్లు పతంజ‌లి రీస‌ర్చ్ ఫౌండేష‌న్ పేర్కొన్న‌ది. హ‌రిద్వార్‌లోని ప‌తంజ‌లి రీస‌ర్చ్ ఇన్స్‌టిట్యూట్‌, జైపూర్‌లోని నిమ్స్ యూనివ‌ర్సిటీ సంయుక్తంగా కోవిడ్19 పేషెంట్ల‌పై త‌మ ట్యాబ్లెట్‌తో క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించిన‌ట్లు ప‌తంజ‌లి సంస్థ పేర్కొన్న‌ది.  


logo