బుధవారం 08 జూలై 2020
National - Feb 04, 2020 , 12:56:02

దేశవ్యాప్తంగా ఎన్నార్సీ.. నిర్ణయం తీసుకోలేదన్న కేంద్రం

దేశవ్యాప్తంగా ఎన్నార్సీ.. నిర్ణయం తీసుకోలేదన్న కేంద్రం

న్యూఢిల్లీ : జాతీయ పౌర జాబితా(ఎన్నార్సీ)పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. సీఏఏ, ఎన్నార్సీపై చర్చ చేపట్టాలని గత రెండు రోజుల నుంచి విపక్ష ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభలో పట్టుబడుతున్న విషయం విదితమే. ఈ క్రమంలో కేంద్రం హోంశాఖ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. దేశ వ్యాప్తంగా ఎన్నార్సీ అమలుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 130 కోట్ల భారతీయులకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే.. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నార్సీపై ఎక్కడా చర్చ జరగలేదు. కానీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఈశాన్య రాష్ర్టాల్లో ఎన్నార్సీ అమలు చేస్తున్నామని తెలిపారు. సీఏఏ, ఎన్సార్సీ పట్ల గత రెండు నెలల నుంచి నిరసనలు చేస్తున్న వారు.. ఈ ప్రకటనతోనైనా శాంతించాలని ప్రభుత్వం భావిస్తుందని పేర్కొన్నారు. సీఏఏపై ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రులతో పాటు ప్రతిపక్ష పార్టీలను సంప్రదించి చర్చిస్తున్నాము. సీఏఏపై ఉన్న భయాందోళనలను పరిష్కరిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెప్పారు. 


logo