సోమవారం 13 జూలై 2020
National - Jun 26, 2020 , 17:11:34

ఆ నాలుగు రాష్ర్టాల్లో క‌రోనా మ‌ర‌ణాలు లేవు

ఆ నాలుగు రాష్ర్టాల్లో క‌రోనా మ‌ర‌ణాలు లేవు

న్యూఢిల్లీ : దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందింది. క‌రోనా మ‌హ‌మ్మారితో దేశ ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. దాదాపు అన్ని రాష్ర్టాల్లో క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించిన‌ప్ప‌టికీ.. ఆ నాలుగు రాష్ర్టాల్లో క‌రోనా మ‌ర‌ణాలు ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదు కాలేద‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్ర‌వారం వెల్ల‌డించింది. 

మ‌ణిపూర్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం రాష్ర్టాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. కానీ మ‌ర‌ణాలు సంభ‌వించ‌లేదు. ఈ రాష్ర్టాల్లో క‌రోనా యాక్టివ్ కేసులు 3,731 ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 5,715 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ఈ నాలుగు రాష్ర్టాల్లో ప్ర‌భుత్వ ప్ర‌యోగ‌శాల‌లు 39 ఉండ‌గా, మ‌రో మూడు ప్ర‌యోగశాల‌లు ప్ర‌యివేటు ఆస్ప‌త్రుల ప‌రిధిలో ఉన్నాయి. వీటిలో క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. 

ఈశాన్య రాష్ర్టాల్లో కొవిడ్ బాధితుల‌కు సేవ‌లందించేందుకు వైద్య స‌దుపాయాలు స‌రిగ్గా లేవ‌ని కేంద్రం పేర్కొంది. వీలైనంత త్వ‌ర‌గా అక్క‌డ వైద్య స‌దుపాయాలు క‌ల్పిస్తామ‌ని తెలిపింది. ఐసీయూ బెడ్లు, ఐసోలేష‌న్ బెడ్లు, వెంటిలేట‌ర్స్ ను స‌మ‌కూర్చుతామ‌ని పేర్కొంది. 


logo