బుధవారం 27 మే 2020
National - May 10, 2020 , 17:33:06

24 గంటల్లో ఒక్క కొత్త కేసు లేదు

24 గంటల్లో ఒక్క కొత్త కేసు లేదు

న్యూఢిల్లీ: గత 24 గంటల్లో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కొత్త  కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని  కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. ఆదివారం ఆయన న్యూడిల్లీలోని మండోలి ప్రాంతంలోని దవాఖానను సందర్శించి అక్కడ కొవిడ్‌-19 వ్యాధిగ్రస్థులకు అందిస్తున్న చికిత్సను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం దాదాపు 72 లక్షల ఎన్‌-95 మాస్కులను, 36 లక్షలకు పైగా పీపీఈ కిట్లను అందజేసిందని చెప్పారు. నాలుగు రాష్ట్రాలు, యూటీలలో ఇంతవరకు ఒక్క పాజిటివ్‌ కేసు నమోదు కాలేదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 4,362 కొవిడ్‌-19 చికిత్స కేంద్రాల్లో దాదాపు 3,46,856 మందికి చికిత్స అందజేస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటివరకు 62,939 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, 19,358 మంది కోలుకొని దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారని, 2,109 మంది చనిపోయారని కేంద్ర మంత్రి తెలిపారు.


logo