శనివారం 16 జనవరి 2021
National - Dec 27, 2020 , 21:23:20

‘నో కరోనా.. కరోనా నో..’ అథవాలే కొత్త నినాదం

‘నో కరోనా.. కరోనా నో..’ అథవాలే కొత్త నినాదం

న్యూఢిల్లీ: బ్రిటన్‌ నుంచి కొత్త రకం కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే ‘నో కరోనా.. కరోనా నో’ అంటూ ఆదివారం కొత్త నినాదం ఇచ్చారు. గతంలో తాను ఇచ్చిన ‘గో కరోనా.. కరోనా గో’ నినాదం పని చేసిందని, దేశంలో కరోనా పరిస్థితి మెరుగైందని ఆదివారం తెలిపారు. ప్రస్తుతం బ్రిటన్‌ నుంచి కొత్త రకం కరోనా వ్యాపిస్తుండటంతో తన తాజా నినాదం ‘నో కరోనా..  కరోనా నో’ కూడా పని చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘ఇంతకు ముందు నేను ‘గో కరోనా, కరోనా గో’ అని నినాదం ఇచ్చాను.  ఇప్పుడు కరోనా వెళ్లిపోతోంది. కొత్త కరోనా వైరస్ కోసం నేను ‘నో కరోనా, కరోనా నో’ నినాదాన్ని ఇస్తున్నా’ అని రామ్‌దాస్ అథవాలే ఏఎన్‌ఐకి చెప్పారు. కాగా అక్టోబర్‌ నెలలో ఆయన కరోనా బారిన పడి కోలుకున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.