గురువారం 28 మే 2020
National - May 14, 2020 , 15:23:39

సీఐఎస్ఎఫ్‌లో శాంతించిన క‌రోనా

సీఐఎస్ఎఫ్‌లో శాంతించిన క‌రోనా

న్యూఢిల్లీ: సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ పోలీస్ ఫోర్స్ (CISF) లో క‌రోనా మ‌హ‌మ్మారి శాంతించింది. గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో సీఐఎస్ఎఫ్‌లో ఒక్క క‌రోనా పాజిటివ్ కేసు కూడా న‌మోదు కాలేదు. ఈ మేర‌కు సీఐఎస్ఎఫ్ గురువారం మ‌ధ్యాహ్నం ఒక హెల్త్ బులెటిన్ విడుద‌ల చేసింది. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 106 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బందికి క‌రోనా వైర‌స్ సోకింద‌ని ఆ బులెటిన్‌లో పేర్కొన్న‌ది. వారిలో ముగ్గురు వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, మిగ‌తా 103 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

సీఐఎస్ఎఫ్‌లో అత్య‌ధికంగా కోల్‌క‌తా నుంచి 39 కేసులు న‌మోద‌య్యాయి. ఢిల్లీ, ముంబై నుంచి 30 మంది చొప్పున క‌రోనా బారిన‌ప‌డ్డారు. ఇక అహ్మ‌దాబాద్‌లో ఐదుగురు, గ్రేట‌ర్ నోయిడాలో ఇద్ద‌రు సీఐఎస్ఎఫ్ సిబ్బందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌బ‌లిన‌ప్ప‌టి నుంచి వివిధ ప్రాంతాల్లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది ముందుండి విధులు నిర్వ‌హిస్తున్నారు.   


logo