మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 02, 2020 , 10:22:25

మిజోరంలో ఒక్క కొత్త కేసు న‌మోదు కాలేదు

మిజోరంలో ఒక్క కొత్త కేసు న‌మోదు కాలేదు

ఐజ్వాల్‌: దేశవ్యాప్తంగా క‌రోనా క‌రాళ నృత్యం చేస్తున్న‌ది. మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, ఢిల్లీ, గుజ‌రాత్,  ఉత్త‌ర‌ప్ర‌దేశ్ త‌దిత‌‌ర రాష్ట్రాల్లో రోజురోజుకు భారీగా పెరుగుతున్న‌ది. ఈశాన్య రాష్ట్రాల్లోనూ చాప‌కింద నీరులా మెల్ల‌మెల్ల‌గా క‌రోనా వైర‌స్ విస్త‌రణ కొన‌సాగుతున్న‌ది. అయితే, మిజోరంలో మాత్రం బుధ‌వారం రాత్రి నుంచి గురువారం రాత్రి వ‌ర‌కు 24 గంట‌ల వ్య‌వ‌ధిలో ఒక్క పాజిటివ్ కేసు కూడా న‌మోదు కాలేదు. మిజోరం రాష్ట్ర‌ స‌మాచార, ప్ర‌జా సంబంధాల శాఖ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. 

గ‌త 24 మిజోరంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా న‌మోదు కాలేద‌ని, అయితే ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య మాత్రం 160కి చేరింది. మొత్తం కేసుల‌లో 123 మంది ఇప్ప‌టికే వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 37 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలావుంటే క‌రోనా వైర‌స్ కార‌ణంగా మిజోరంలో ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క మ‌ర‌ణం కూడా న‌మోదు కాక‌పోవ‌డం సంతోషించ‌ద‌గ్గ విష‌యం.     


logo