బుధవారం 27 జనవరి 2021
National - Jan 08, 2021 , 18:52:00

ఎటూ తేలకుండానే ముగిసిన చర్చలు... 15న మరోసారి భేటీ

ఎటూ తేలకుండానే ముగిసిన చర్చలు... 15న మరోసారి భేటీ

న్యూఢిల్లీ : కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన నిరసిస్తున్న రైతుల సంఘాలతో శుక్రవారం జరిగిన ఎనిమిదో విడత చర్చలు శుక్రవారం ఎటూ తేలకుండా ముగిశాయి. రైతు సంఘాల నేతలతో కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్‌, పీయుష్‌ గోయల్‌, సోమ్‌ప్రకాశ్‌ ఢిల్లీ విజ్ఞాన భవన్‌లో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా చర్చల్లో ఎట్టి పరిస్థితుల్లో చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు నేతలు భీష్మించారు. అయితే చట్టాలు వెనక్కి తీసుకోవడం తప్పా.. మరే ప్రతిపాదనకైనా తాము సిద్ధమేనని కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసింది. కొత్త వ్యవసాయ చట్టాలను రైతులను అర్థం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేసింది. అటు రైతు సంఘాల నేతలు, కేంద్రం పట్టువీడకపోవడంతో చర్చలు ఎటూ తేలకుండానే ముగిశాయి. ఈ నెల 15న మరోసారి సమావేశం కానున్నట్లు కేంద్రమంత్రి తోమర్‌ తెలిపారు. సమావేశం జరుగుతుండగా.. విజ్ఞాన్ భవన్ రైతులు ‘మరణమో లేదా విజయమో’, ‘చట్టాలు రద్దయితేనే ఇంటికి’ నినాదాలతో ప్లకార్డులను ప్రదర్శించారు. ఇదిలా ఉండగా.. కేంద్రం తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించకపోతే ఆందోళనలు ఉధృతం చేసేందుకు రైతు సిద్ధమవుతున్నారు. ఈ నెల 11న రైతు సంఘాల సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నారు.


logo