ఆదివారం 29 నవంబర్ 2020
National - Oct 30, 2020 , 15:47:00

వ్యవసాయ రంగానికి వడ్డీ పై వడ్డీ మాఫీ లేనట్లేనా...?

వ్యవసాయ రంగానికి వడ్డీ పై వడ్డీ మాఫీ లేనట్లేనా...?

 ఢిల్లీ : ఆరు నెలల మారటోరియం కాలానికి రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీ మాఫీ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా సాధారణ వడ్డీకి, చక్రవడ్డీకి ఉన్న తేడాను రుణ గ్రహీతల ఖాతాల్లో రుణ విక్రేతలు జమ చేయనున్నారు. మారటోరియం ఉపయోగించుకోని వారికి కూడా ఈ పథకం ‌ వర్తిస్తుంది. ఈ ప్రక్రియను నవంబరు 5కల్లా పూర్తి చేయాలని కేంద్ర సర్కారు , రిజర్వ్హ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆర్థిక సంస్థల్నికోరాయి. కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం.. గృహ రుణాలు, విద్య, వాహన, ఎంఎస్‌ఎంఈ, వినియోగ వస్తువుల కొనుగోలు రుణాలు, వినియోగ రుణాలు వంటివి ఈ స్కీమ్‌ పరిధిలోకి వస్తాయి.

ఈ స్కీమ్‌ వర్తించాలంటే ఫిబ్రవరి 29 నాటికి సదరు ఖాతా ఎన్‌పీఏగా గుర్తించి ఉండకూడదని కేంద్రం తన మార్గదర్శకాల్లో స్పష్టంచేసింది. అయితే వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన రుణాలకు చక్రవడ్డీ మాఫీ వర్తించదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పంట, ట్రాక్టర్‌ రుణాలు వ్యవసాయ రుణాల కిందకే వస్తాయి గనుక వాటికి వడ్డీ మాఫీ ఉండదని తెలిపింది. వడ్డీమాఫీపై ఉన్నసందేహాలను నివృత్తి చేసేలా తరచూ అడిగే ప్రశ్నల జాబితా(ఎఫ్‌ఏక్యూ)ను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఫిబ్రవరి 29 నాటికి ఉన్న క్రెడిట్‌ కార్డు బకాయిలకు ఈ ఉపశమనం వర్తిస్తుందని మరోసారి స్పష్టం చేసింది. 

 లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.