తీరం దాటిన నివర్ తుఫాను.. పుదుచ్చేరిలో కుంభవృష్టి

హైదరాబాద్: నివర్ తుఫాను పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటింది. నిన్న రాత్రి 11.30 గంటల నుంచి తెల్లవారుజామున 2.30 గంటల మధ్య తీరం దాటిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను తీరం దాటే సమయంలో 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో గాలులువీచాయి. దీంతోపాటు వరణుడు కుంభవృష్టి కురింపించాడు. తుఫాను తీరందాటిన తర్వాత అతి తీవ్ర తుఫాను నుంచి తుఫానుగా మారిందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో పుదుచ్చేరితోపాటు, తమిళనాడులోని చెన్నై సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పుదుచ్చేరిలో 237 మిల్లీమీటర్లు, తమిళనాడులోని కడలూరులో 237 మిల్లీమీటర్ల చొప్పున, రాజధాని చెన్నైలో భారీ వర్షం కురిసింది. తుఫాను ప్రభావంతో తమిళనాడులో ఇప్పటివరకు 1.45 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్రంలో 1,516 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావద్దని సీఎం పళని స్వామి విజ్ఞప్తి చేశారు. పుదుచ్చేరిలో కురిసిన భారీ వర్షంతో వీధుల్లో పెద్దఎత్తున నీరు నిలిచింది. సీఎం నారాయణ స్వామి ఇళ్లు వరదనీటిలో మునిగిపోయింది.
తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలులు తీవ్రంగా వీస్తుండటంతో భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు సహాయక చర్యల కోసం ఐదు ఎస్డీఆర్ఎఫ్, నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. ఇల్లు సురక్షితం కాకపోతే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. రైతులు అప్రమత్తంగా ఉండి, పంట సంరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. చిత్తూరు జిల్లాలో తుఫాను ప్రభావంపై అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని తూర్పు ప్రాంతాల్లో తుఫాను ప్రభావం అధికంగా ఉంటుందనే అంచనాతో సహాయకచర్యలు చేపట్టారు. సత్యవేడు నియోజకవర్గం పరిధిలో 340 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
తాజావార్తలు
- చెత్త సేకరణకుకొత్త ప్రణాళికలు
- తగ్గుతున్న చౌరస్తాలు.. పెరుగుతున్న యూటర్న్లు
- పార్కుల అభివృద్ధికి చర్యలు
- పేదల సంక్షేమానికి పెద్దపీట
- బ్యాంకింగ్‌లోకి కార్పొరేట్లకు అనుమతి మంచిదే: ఆదిత్యపూరీ
- చిత్తారమ్మ జాతరకు సర్వం సిద్ధం
- ఆరు దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తాం: మోదీ సంకేతాలు
- ‘గ్రాజియా’ ఫీచర్స్...అదుర్స్...!
- 27న జైలు నుంచి శశికళ విడుదల
- బ్యాంకర్లు, ఎన్బీఎఫ్సీలతో టాటా టైఅప్.. అందుకేనా?!