శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
National - Jan 24, 2021 , 22:03:02

లాలూ త్వ‌ర‌గా కోలుకోవాలి: ‌నితీశ్ ఆకాంక్ష‌

లాలూ త్వ‌ర‌గా కోలుకోవాలి: ‌నితీశ్ ఆకాంక్ష‌

పాట్నా: అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ ప్ర‌స్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్ ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ (72) త్వరిత‌గ‌తిన కోలుకోవాల‌ని బీహార్ సీఎం నితీశ్‌కుమార్ ఆకాంక్షించారు. కానీ లాలూ ఆరోగ్యం గురించి నేరుగా వాక‌బు చేయ‌బోన‌ని ఆదివారం చెప్పారు. శ్వాస‌కోశ సంబంధ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌ను చికిత్స కోసం రాంచీ నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు త‌ర‌లించారు. 

ప‌శుగ్రాసం కేసుల్లో జైలుశిక్ష అనుభ‌విస్తున్న లాలూకు ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు ఉండ‌టంతో రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్నారు. లాలూ ఆరోగ్యంపై నితీశ్‌కుమార్‌ను మీడియా ఆదివారం ప్ర‌శ్నించిన‌ప్పుడు.. 2018లో ఆయ‌న ఆరోగ్యం గురించి వాక‌బు చేసిన‌ప్పుడు లాలూ కేర్ టేక‌ర్ చెప్పిన సంగ‌తులు నాకు గుర్తు ఉన్నాయి. అప్పుడే లాలూ ఆరోగ్యం గురించి వాక‌బు చేయొద్ద‌ని నిర్ణ‌యించుకున్నాను. మీడియా ద్వారా మాత్ర‌మే తెలుసుకుంటున్నాన‌ని చెప్పారు. నితీశ్‌కుమార్ ద్రుష్టిలో లాలూ కేర్ టేక‌ర్ అంటే విప‌క్ష నేత తేజ‌స్వి యాద‌వ్ అని తెలుస్తున్న‌ది. 

రెండేండ్ల క్రితం లాలూ ఆరోగ్యం గురించి వ‌చ్చిన వ‌దంతుల‌పై సీఎం నితీశ్ ఫోన్ చేసిన‌ప్పుడు తేజ‌స్వి విరుచుకు ప‌డ్డారు. బీహార్‌లో తొలి నుంచి సోష‌లిస్టు ఉద్య‌మంలో లాలూ, నితీశ్ క‌లిసి ప‌ని చేశారు. త‌ర్వాత కాలంలో విడిపోయిన నితీశ్‌.. 2015లో లాలూతో క‌లిసి ఎన్నిక‌ల్లో పోటీ చేసి విజ‌యం సాధించారు. కానీ త‌ర్వాత ఆర్జేడీ సార‌థ్యంలోని మ‌హా కూట‌మి నుంచి తెగ‌దెంపులు చేసుకుని బీజేపీతో నితీశ్ కుమార్ కూట‌మి క‌ట్టి తిరిగి అధికారం చేప‌ట్టారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo