శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 01, 2020 , 19:22:05

మ‌ళ్లీ మ‌హా కూట‌మిలోకే నితీశ్‌: చిరాగ్ పాశ్వాన్‌

మ‌ళ్లీ మ‌హా కూట‌మిలోకే నితీశ్‌: చిరాగ్ పాశ్వాన్‌

పట్నా: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జేడీయూ అధినేత, ముఖ్య‌మంత్రి నితీశ్‌ కుమార్‌ ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమి పంచకు చేరడం ఖాయమని ఎల్జేపీ అధ్య‌క్షుడు చిరాగ్ పాశ్వాన్‌‌ అన్నారు. అంతేగాక‌ 2024 లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి పోటీగా ప్రధాని అభ్యర్థిగా బరిలో నిలువాలని నితీశ్ భావిస్తున్న‌ట్లు చిరాగ్ తెలిపారు. ఎప్పటికైనా భాజపాకు తామే అత్యంత విశ్వాసపాత్రమైన పార్టీ అని చెప్పారు. లాలూ ప్రసాద్‌ పాలనను వ్యతిరేకిస్తూ తొలిసారి ఎన్డీయే భాగస్వామిగా నీతీశ్‌ అధికారంలోకి వచ్చారని, అయితే కొన్నేళ్లకే భాజపాతో బంధాన్ని తెంచుకున్నారన్నారని చిరాగ్ గుర్తుచేశారు. 

గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్రమోదీని నితీశ్ కుమార్ తీవ్రంగా వ్యతిరేకించారని పాశ్వాన్‌ చెప్పారు. సరిగ్గా ఐదేండ్ల‌ క్రితం లాలూతో కలిసి ఎన్నికల్లో గెలుపొందారని, రెండేండ్ల‌కే ఆ బంధాన్ని తెంచుకుని మళ్లీ ఎన్డీయే కూటమిలో చేరార‌ని, నితీశ్‌ పచ్చి అవకాశవాది అనడానికి ఇవి నిద‌ర్శ‌నాల‌ని చిరాగ్ విమర్శించారు. ఈ ఎన్నికల ఫలితాల అనంతరం నితీశ్‌ మరోసారి మహాకూటమి పంచన చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఆయ‌న‌ జోష్యం చెప్పారు. ఈ విషయంలో తన మాటలను గుర్తు పెట్టుకోవాలన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.