సోమవారం 30 నవంబర్ 2020
National - Oct 25, 2020 , 16:46:12

ఎల్జేపీ అధికారంలోకి వస్తే నితీశ్ జైలుకెళ్తారు: చిరాగ్

ఎల్జేపీ అధికారంలోకి వస్తే నితీశ్ జైలుకెళ్తారు: చిరాగ్

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) అధికారంలోకి వస్తే సీఎం నితీశ్ కుమార్ తప్పకుండా జైలుకెళ్తారని ఆ పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. బక్సర్‌లోని దుమ్రాన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం నితీశ్ ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించారు. మద్యం రద్దు విఫలమైందని విమర్శించారు. అక్రమ మద్యం అమ్మకాల ద్వారా సీఎం నితీశ్ కుమార్‌కు ముడుపులు అందుతున్నాయని చిరాగ్ ఆరోపించారు. బీహార్ ఫస్ట్ కోసం ప్రతి ఒక్కరు ఎల్జేపీకి లేదా బీజేపీకి ఓటు వేయాలని, నితీశ్‌ లేని ప్రభుత్వం కోసం సహకరించాలని ఓటర్లను కోరారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.