గురువారం 03 డిసెంబర్ 2020
National - Nov 05, 2020 , 14:55:04

తేజస్వి ముందు నితీశ్‌ తలవంచుతారు: చిరాగ్‌

తేజస్వి ముందు నితీశ్‌ తలవంచుతారు: చిరాగ్‌

పాట్నా: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల తుది దశ పోలింగ్‌కు ముందు సీఎం నితీశ్‌ కుమార్‌పై లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) చీఫ్‌ చిరాగ్‌ పాశ్వాన్‌ మరోసారి మండిపడ్డారు. ఈ నెల 10న ఫలితాలు వెల్లడయ్యాక ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ ముందు ఆయన తల ఒగ్గుతారని విమర్శించారు. ‘ప్రధాని మోదీని విమర్శించడంలో నువ్వు ఎప్పుడు అలసిపోలేదు. ఆయనతో స్టేజ్‌ పంచుకున్నప్పుడు తల ఒగ్గేందుకు ఎలాంటి సంకోచం పడలేదు. సీఎం పదవి కోసం నీ దురాశను ఇది తెలియజేస్తున్నది. ఎన్నికల ఫలితాల తర్వాత తేజస్వి ముందు కూడా అలాగే తలదించుతావు’ అని చిరాగ్‌ వాఖ్యానించారు.

కరోనా నియంత్రణ, నిరుద్యోగ రేటు పెరుగుదల, అభివృద్ధిలో వెనుకబాటుకు సీఎం నితీశ్‌ చేతగానితనమే కారణమంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో జేడీయూ ప్రభుత్వం చేసిన అభివృద్ధినికాక, కేంద్ర పథకాలతో తిరిగి అధికారంలోకి రావచ్చని ఆయన ఆశిస్తున్నారని చిరాగ్‌ విమర్శించారు. నితీశ్‌ ప్రభుత్వం గత ఐదేండ్లలో చేసిన అభివృద్ధి ఏమిటన్నది మిస్టరీగా మారిందంటూ బుధవారం ట్విట్టర్‌లో కూడా విమర్శించారు. సీఎం నితీశ్‌ కుమార్‌తోపాటు ప్రధాని మోదీకి దీనిని ట్యాగ్‌ చేశారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.