సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 13, 2020 , 01:22:01

ఖాదీ వాచీలు మాకు లేవా? లోక్‌సభలో గడ్కరీని కోరిన సభ్యులు

ఖాదీ వాచీలు మాకు లేవా? లోక్‌సభలో గడ్కరీని కోరిన సభ్యులు

న్యూఢిల్లీ: లోక్‌సభలో గురువారం ఖాదీ చేతి గడియారాల అంశం సభ్యుల మధ్య నవ్వులు పూయించింది. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ లోక్‌సభ స్పీకర్‌ దంపతులకు ఇటీవల రెండు ఖాదీ వాచీలు ఇచ్చినట్టు చెప్పారు. దీంతో మాకు ఇవ్వారా? అంటూ ఇతర సభ్యులు గడ్కరీని అడుగడంతో నవ్వులు పూశాయి. ఈ వాచీలు ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌, టైటాన్‌ సంయుక్త భాగస్వామ్యంతో తయారవుతున్నట్టు గడ్కరీ చెప్పారు. సిల్వర్‌ ఫ్రేమ్‌లో.. ఖాదీతో తయారుచేసిన డయల్‌, దానిపై చరఖా చిహ్నం ఉంటాయన్నారు. వాచీ బెల్ట్‌ సైతం ఖాదీదేనన్నారు. మహిళలు తయారు చేస్తు న్న ఈ వాచీ విలువ రూ.5 వేలన్నారు. సభ్యులకు రాయితీపై అందజేస్తామన్నారు.


logo