ఆదివారం 12 జూలై 2020
National - Jun 16, 2020 , 14:15:54

ఇప్ప‌ట్లో ముంబైకి వెళ్లే ధైర్యం లేదు: గ‌డ్క‌రీ

ఇప్ప‌ట్లో ముంబైకి వెళ్లే ధైర్యం లేదు: గ‌డ్క‌రీ

ముంబై: ఇప్ప‌ట్లో త‌న‌కు ముంబైకి వెళ్లే ధైర్యం లేద‌ని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. కరోనా కారణంగా ప్ర‌స్తుతం ముంబైలో పరిస్థితి బాగలేదని, అయితే రాబోయే రోజుల్లో అక్క‌డి పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందని గ‌డ్క‌రీ వ్యాఖ్యానించారు. ముంబైలో క‌రోనా ర‌క్క‌సి క‌రాళ‌ నృత్యం చేస్తున్న నేప‌థ్యంలో గ‌డ్క‌రీ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ముంబైలో కరోనా తీవ్రతవల్ల ఇప్ప‌టికే పెద్ద సంఖ్యలో పోలీసులు, వైద్య సిబ్బంది, మున్సిపల్ అధికారులు కరోనా బారినపడ్డారు. కరోనా కట్టడి కోసం యత్నిస్తూ అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. 

కాగా, దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. అందులోనూ  ముంబైలో క‌రోనా రోగుల సంఖ్య శ‌ర‌వేగంగా పెరుగుతున్న‌ది. అయితే అదృష్టవశాత్తు ముంబైలోని ధారావి మురికివాడలో కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. పుణెలో అధికంగా కేసులు న‌మోదైనా ముంబై అంతటి ప్ర‌భావంలేదు. ముంబైలో ఇప్పటివరకు 1.8 ల‌క్ష‌ల మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. 3,950 మంది మ‌ర‌ణించారు.


logo