సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 23:34:33

నీతి ఆయోగ్ సంచలన నిర్ణయం

 నీతి ఆయోగ్ సంచలన నిర్ణయం

ఢిల్లీ : నీతి ఆయోగ్ సంచలన నిర్ణయం తీసుకున్నది. బ్లూ కాలర్, గ్రే కాలర్ ఉద్యోగుల కోసం ఒక ప్రత్యేక వెబ్సైటు ను రూపొందించనున్నది. ఈ ప్రత్యేక జాబ్ పోర్టల్ లో వారు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త ఉద్యోగాలు పొందవచ్చు. ఇది అందుబాటులోకి వస్తే సుమారు 20 కోట్ల మంది శ్రామికులకు ప్రయోజనం చేకూరనుందని అంచనా వేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశం మేరకు నీతి ఆయోగ్ ఈ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పెద్ద ఎత్తున వలస కార్మికులు తమ పని ప్రదేశాలను వదిలేసి సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. లాక్ డౌన్ సడలించినప్పటికీ వారు మళ్ళీ పనికి తిరిగి రావటం లేదు. దీంతో కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఫ్యాక్టరీలకు శ్రామికులు లభించటం లేదు... అలాగే సొంత ఊళ్లకు వెళ్లిపోయిన వారికి అక్కడ ఉపాధి దొరకటం లేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు నీతి ఆయోగ్ ఒక జాబ్ పోర్టల్ ను రూపొందించి అందులో ఎక్కడికక్కడ స్థానికంగా లభించే ఉద్యోగాల వివరాలు వెల్లడించనుంది. దీంతో అటు కంపెనీలకు ఇటు శ్రామికులకు మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు.


logo