గురువారం 09 జూలై 2020
National - Jun 22, 2020 , 08:52:40

నీతా అంబానీకి అరుదైన గౌర‌వం ద‌క్కింది!

నీతా అంబానీకి అరుదైన గౌర‌వం ద‌క్కింది!

రిల‌య‌న్స్ ఫౌండేష‌న్ చైర్ ప‌ర్స‌న్ నీతా అంబానీకి అరుదైన గౌర‌వం ద‌క్కింది. క‌రోనా కాలంలో ఆమె చేసిన కృషికి గాను అమెరికాకు చెందిన ప్ర‌ముఖ మ్యాగ‌జైన్ టౌన్ అండ్ కంట్రీ విడుద‌ల చేసిన టాప్ గ్లోబ‌ల్ ఫిలాంత్ర‌పిస్ట్స్‌-2020 జాబితాలో ఆమెకు చోటు ద‌క్కించుకుంది. క‌రోనా వ్యాప్తి ప్ర‌పంచ‌మంతా లాక్‌డౌన్‌లో ఉన్న‌ది. ఆ స‌మ‌యంలో స‌రైన ఉపాధి లేక అల‌మ‌టిస్తున్న వారికి ఆహారం అందించి ల‌క్ష‌లాది మంది ఆక‌లి తీర్చిన అన్న‌పూర్ణ‌గా పేరు తెచ్చుకున్న నీతా అంబానీ.

ఎలాంటి ఆప‌ద వ‌చ్చిన రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా నీతా అంబానీ సాయం చేయ‌డానికి ముందుంటార‌న్న‌ సంగ‌తి తెలిసిందే. ప్రజలకు ఆహరం అందించడమే కాకుండా.. ఆమె ప్రభుత్వానికి కూడా పెద్ద మొత్తం లో విరాళాలు అందించారు. ముంబైలో తొలి కోవిద్ ఆసుపత్రిని కట్టించారు. అంతే కాదు.. ఎంతోమంది వైద్యులు, వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్క్‌లు అందించారు. ఈ సేవలకుగాను నీతా అంబానీకి ఇప్పుడు అరుదైన గౌరవం దక్కింది.


logo