గురువారం 28 మే 2020
National - May 14, 2020 , 20:52:12

మావోయిస్టులకు సహకరించిన నిశాంత్‌ అరెస్ట్‌

మావోయిస్టులకు సహకరించిన నిశాంత్‌ అరెస్ట్‌

కొత్తగూడెం : మావోయిస్టులకు నగదు, నిత్యావసరాలు, సాంకేతిక సహకారం అందిస్తున్న ఢిల్లీకి చెందిన నిశాంత్‌కుమార్‌ జైన్‌ను  ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు అరెస్టు చేశారు. కాంకేర్‌ జిల్లా ఎస్పీ ఎం.ఆర్‌ అహీర్‌ తెలిపిన వివరాల ప్రకారం..ఢిల్లీకి చెందిన నిశాంత్‌కుమార్‌ జైన్‌ 2001-02 సంవత్సరంలో కాంట్రాక్టు పనుల నిమిత్తం ఛత్తీస్‌గఢ్‌కు వచ్చి స్థిరపడ్డాడు. కాంకేర్‌ జిల్లాలోని కోయిలాబేడ్‌, ఆమాబేడ్‌, సికాసోడ్‌, రావ్‌ఘాట్‌, తాడోకి ప్రాంతాల్లో ఓ ఇంజనీరింగ్‌ కంపెనీ ద్వారా కాంట్రాక్టు రహదారి పనులు చేస్తూ ఎదిగాడు. తన పనులకు మావోయిస్టులు ఆటంకం కలిగించకూడదనే ఉద్దేశంతో కొంతకాలంగా వారికి సహకరిస్తున్నాడు. నగదు, నిత్యావసరాలు, బూట్లు, దుస్తులు, వాకీటాకీలు తదితర పరికరాలను సమకూరుస్తున్నాడు. 

ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి నెలలో పోలీసులు సికాసోడ్‌ ప్రాంతంలో మావోయిస్టులకు వస్తువులు, నిత్యావసరాలు అందజేస్తున్న 11 మందిని అరెస్టు చేశారు. వీరిని అదుపులోకి తీసుకుని లోతైన విచారణ జరుపగా, దీని వెనుక నిశాంత్‌కుమార్‌ జైన్‌ కీలకపాత్ర ఉన్నదని తేలింది. దీనిపై పోలీసు ఉన్నతాధికారి కీర్తన్‌ రాఠౌర్‌ నేతృత్వంలో అక్కడి ప్రభుత్వం సిట్‌(ప్రత్యేక దర్యాప్తు బృందం) వేసింది. ఇదంతా జరుగుతున్న నిశాంత్‌కుమార్‌ జైన్‌ పరారీలో ఉన్నాడు.  ఎట్టకేలకు పోలీసులు బిలాస్‌పూర్‌లో ఎట్టకేలకు నిశాంత్‌కుమార్‌ జైన్‌ను అరెస్టు చేశారు. నిందితుడితో కలిసి రాజ్‌నంద్‌గావ్‌ జిల్లాకు చెందిన అజయ్‌జైన్‌, కోమల్‌ వర్మ, తాపస్‌ కూడా పనిచేసినట్లుగా విచారణలో వెల్లడైనట్లు ఎస్పీ అహీర్‌ తెలిపారు.logo