శుక్రవారం 10 జూలై 2020
National - Jun 02, 2020 , 12:45:36

అరేబియా స‌ముద్రంలో బ‌ల‌ప‌డిన నిస‌ర్గ‌

అరేబియా స‌ముద్రంలో బ‌ల‌ప‌డిన నిస‌ర్గ‌

హైద‌రాబాద్‌: అరేబియా స‌ముద్రంలో నిస‌ర్గా తుఫాన్ బ‌ల‌ప‌డింది. దీంతో గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర తీరాల వ‌ద్ద వ‌ర్షం కురుస్తోంది. వ‌ల్సాద్‌తో పాటు ముంబై తీర ప్రాంతాల్లో జ‌ల్లులు కురుస్తున్నాయి. రేప‌టి సాయంత్రానికి నిస‌ర్గ తీరం దాటే అవకాశం ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. రెండు రాష్ట్రాల‌కు చెందిన తీరాల వ‌ద్ద జెమినీ బోట్ల‌తో రెస్క్యూ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. కోస్టుగార్డులు కూడా ఎప్ప‌టిక‌ప్పుడు హెచ్చ‌రిక‌లు చేస్తున్నారు.  స‌ముద్రంలోకి వెళ్ల‌కూడ‌దంటూ జాల‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేశారు. అరేబియా స‌ముద్రంలో సైక్లోనిక్ స‌ర్క్యులేష‌న్ మొద‌లైన‌ట్లు ఐఎండీ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ మృత్యుంజ‌య మ‌హాపాత్ర తెలిపారు. సింధుదుర్గ‌, ర‌త్న‌గిరి, థానే, రాయిగ‌డ్‌, ముంబై, ఫాల్గ‌ర్ లాంటి కోస్తా ప్రాంతాల్లో తుఫాన్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉన్న‌ది.  ప్ర‌స్తుతం గోవా రాజ‌ధాని పాంజీకి సుమారు 280 కిలోమీట‌ర్ల దూరంలో నిస‌ర్గ కేంద్రీకృత‌మై ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు. 


logo