శనివారం 06 జూన్ 2020
National - May 18, 2020 , 12:04:08

నిర్మలా ఏమిటా మాటలు..

నిర్మలా ఏమిటా మాటలు..

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు మరిన్ని రైళ్లు పంపుతామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ తీవ్రంగా స్పందించారు. నెలరోజులు ఆలస్యంగా రైళ్లు నడిపారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నాయకత్వంపై ఆమె చేసిన వ్యాఖ్యలు సీనియర్ మంత్రి స్థాయికి తగ్గట్టుగా లేవని అన్నారు. కాంగ్రెస్ ఎంతగా అడిగినా రైళ్లు నడపలేదని గుర్తుచేశారు. ఎక్కడ పడితే అక్కడ చిక్కుబడిపోయిన కార్మికులను తరలించేందుకు అందరం కలిసి పనిచేయాలని హితవు చెప్పారు. ఇప్పటికే 170 రైళ్లల్లో 2 లక్షల మందిని ఇళ్లకు పంపామని పంజాబ్ సీఎం తెలిపారు. ఆ పనిని కొనసాగిస్తామని కూడా చెప్పారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వలస కార్మికులను కలుసుకోవడాన్ని కేంద్రమంత్రి నిర్మల డ్రామాగా అభివర్ణించారు. వారి సమయాన్ని వృధా చేయకుండా వారితోపాటే కలిసి నడవాల్సిందని, వారి సూట్‌కేసు మోయాల్సిందని వ్యాఖ్యానించారు.


logo