మంగళవారం 02 జూన్ 2020
National - May 17, 2020 , 08:44:00

ఈ ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్‌ మీడియా సమావేశం

ఈ ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్‌ మీడియా సమావేశం

ఢిల్లీ : ఈ ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం ద్వారా ఆర్థిక ప్యాకేజీ-5 వివరాలను ఆమె వెల్లడించనున్నారు. కరోనా నేపథ్యంలో దేశంలో తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ. 20 లక్షల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్యాకేజీ వివరాలను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ విడతలవారీగా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా ఆర్థిక ప్యాకేజీలోని చివరి విడత ప్యాకేజీని మంత్రి నేడు ప్రకటించనున్నారు. నిన్న ప్రకటించిన మూడవ విడత ప్యాకేజీలో ఖనిజరంగం, బొగ్గు గనుల్లో ప్రభుత్వ గుత్తాధిపత్యానికి తెరదించుతూ ప్రైవేటు వాణిజ్యాన్ని చోటుకల్పించారు. అదేవిధంగా విమానయానం, అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు ఆహ్వానం, సాధ్యమైనంత వరకు రక్షణరంగ ఉత్పత్తుల దిగుమతులపై నిషేదం విధించడం వంటి చర్యలకు ఉపక్రమించింది. 


logo