శనివారం 06 జూన్ 2020
National - May 16, 2020 , 16:36:43

ఒకే దేశం-ఒకే మార్కెట్‌ విధానాన్ని అమలు చేస్తున్నాం: కేంద్రమంత్రి నిర్మల

ఒకే దేశం-ఒకే మార్కెట్‌ విధానాన్ని అమలు చేస్తున్నాం: కేంద్రమంత్రి నిర్మల

న్యూఢిల్లీ: పెట్టుబడులకు కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దే ప్రక్రియ నిరంతరం జరుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ తెలిపారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌, బీఏఎఫ్‌ఆర్‌ అమలులో కేంద్ర ప్రభుత్వం చాలా ముందుందని చెప్పారు. రానున్న రోజుల్లో పోటీకి అనుగుణంగా భారత్‌ సన్నద్ధం కావాలన్నారు.  నాలుగో విడత ఆర్థిక ప్యాకేజీ వివరాలను నిర్మల ఇవాళ మీడియా సమావేశంలో వివరించారు. ఈ ప్యాకేజీలో  పలు రంగాలకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. 

'వ్యవస్థలను బలోపేతం చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ అద్భుతమైన సంస్కరణలు చేపట్టారు.  చాలా రంగాలు సరళీకరణ విధానాలు కోరుకుంటున్నాయి. ఒకే దేశం-ఒకే మార్కెట్‌ విధానాన్ని అమలు చేస్తాం. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ల్యాండ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేస్తున్నాం. ప్రత్యక్ష పెట్టుబడుల్లో తీసుకువచ్చిన సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ప్రజలకు నేరుగా నగదు అందించే విషయంలో ప్రభుత్వం ముందుందని' మంత్రి నిర్మల పేర్కొన్నారు. 


logo