ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 11, 2020 , 19:35:13

జప్తుచేసిన పురాతన నాణేలను సాంస్కృతిక శాఖామంత్రికి అందజేసిన నిర్మలా సీతారామన్

 జప్తుచేసిన పురాతన నాణేలను సాంస్కృతిక శాఖామంత్రికి అందజేసిన నిర్మలా సీతారామన్

ఢిల్లీ : కస్టమ్స్ అధికారులు వివిధ సందర్భాలలో జప్తు చేసిన పురాతన వస్తువులను, నాణేలను కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖా మంత్రి నిర్మలాసీతారామన్ బుధవారం ఢిల్లీలోని నార్త్ బ్లాక్ లో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖామంత్రి  ప్రహ్లాద్ సింగ్ పటేల్ కు అందజేశారు. కస్టమ్స్ అధికారులు పట్టుకున్న 40,282 నాణేలు 1206-1720 మధ్య కాలంలో పాలించిన సుల్తానులు, మొఘలులకు చెందినవి. అదే విధంగా వాటిలో 19800-1900 మధ్య కాలంలోని కుషాణులు, యౌధేయులు, గుప్తులు, ప్రతీహారులు, చోళులు, రాజపుత్రులు, మొఘలులు, మరాఠాలు, కశ్మీరీల చిన్న చిన్న రాజ్యాలకు చెందిన నాణేలతోబాటు బ్రిటిష్ ఇండియా, ఫ్రెంచ్, ఆస్ట్రేలియా నాణేలు కూడా వాటిలో ఉన్నాయి.

వాటిలో 18 రాజముద్రికలు, మతపరమైన చిహ్నాలు కూడా ఉన్నాయి. వీటిని అధికారప్రతినిధులు ధరించేవారు. రాజకుటుంబాల/కులీన మహిళలు నడుముకు పెట్టుకునే వెండి వడ్డాణం కూడా ఇందులో ఉంది. హాంకాంగ్ వెళుతున్న ఇద్దరు విదేశీయులను 1994 జూన్ 21న ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అడ్దుకున్నప్పుడు అనేక విలువైన వస్తువులు దొరికాయి, వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు నమోదు చేశారు.  ఆ తరువాత వారిని ప్రశ్నించిన అనంతర  నగరంలోని ఒక ఇంట్లో వెతికినప్పుడు మిగిలిన బంగారు నాణేలు, వస్తువులు దొరికాయి. చట్ట ప్రకారం లాంఛనాలన్నీ పూర్తయ్యాక కస్టమ్స్ అధికారులు ఈ వస్తువుల విలువను లెక్కించవలసింగా పురావస్తు శాఖను కోరగా ఒక కమిటీ వీటికి విలువ కట్టింది. 2020 జనవరి/జూన్ లో ఈ 40,301 పురాతన వస్తువుల విలువను 63.90 కోట్లుగా అంచనావేసింది. లెవెన్త్ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ల తో అసుస్‌ ల్యాప్‌టాప్స్

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.