గురువారం 28 మే 2020
National - May 15, 2020 , 16:27:21

ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ మూడో విడత ప్యాకేజీ ప్రకటన

ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ మూడో విడత ప్యాకేజీ ప్రకటన

ఢిల్లీ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశంలో నెలకొన్న సంక్షోభ నివారణకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూ. 20 లక్షల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ విడుతలవారీగా ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా నేడు ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ మూడో విడత ప్యాకేజీ వివరాలను ప్రకటించారు. మూడో విడత ఆర్థిక ప్యాకేజీలో మొత్తం 11 అంశాలపై ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలిపారు. 

దేశంలో 85 శాతం వ్యవసాయ కమతాలు చిన్న, సన్నకారు రైతులవేనన్నారు. వర్షాభావం, వాతావరణ సమస్యలు అధిగమించి రైతులు శ్రమిస్తున్నారన్నారు. ధాన్యం, గోధుమల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించినట్లు తెలిపారు. జూట్‌ ఉత్పత్తిలో భారత్‌ అగ్రగామిగా ఉందన్నారు. చెరుకు, పత్తి, వేరుశెనగ, పప్పుధాన్యాల ఉత్పత్తిలో మనం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నామన్నారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, మత్స్య, డెయిరీ, పప్పుధాన్యాలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఉత్పత్తులకు ప్యాకేజీని ప్రకటించారు.


logo