బుధవారం 27 మే 2020
National - May 17, 2020 , 11:22:15

చివరి విడత ప్యాకేజీ వివరాలు ప్రకటిస్తున్న నిర్మలా సీతారామన్‌

చివరి విడత ప్యాకేజీ వివరాలు ప్రకటిస్తున్న నిర్మలా సీతారామన్‌

ఢిల్లీ : కరోనా నేపథ్యంలో దేశంలో తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ. 20 లక్షల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్యాకేజీ వివరాలను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ విడతలవారీగా ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా ఆర్థిక ప్యాకేజీలోని చివరి విడత, ప్యాకేజీ-5 వివరాలను ఆమె వెల్లడిస్తున్నారు. శనివారం ప్రకటించిన ప్యాకేజీలో ఖనిజ రంగంలో, బొగ్గు సెక్టార్‌లో ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని తొలగిస్తూ పారదర్శకత పెంపొందేలా ప్రైవేటు వాణిజ్యానికి అవకాశం కల్పించడం. ఈ రంగంలో మౌలిక సదుపాయల కల్పనకు రూ. 50 వేల కోట్లు ప్రకటించారు. అంతకుక్రితం శుక్రవారం ప్రకటించిన ప్యాకేజీలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు, మైక్రో ఫుడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ తదితర రంగాల ఊతానికి రూ. లక్ష కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. మొదటి విడత ప్యాకేజీలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహానికి ప్యాకేజీని ప్రకటించారు.


logo