మంగళవారం 07 ఏప్రిల్ 2020
National - Mar 20, 2020 , 06:11:55

నా కుమార్తెకు న్యాయం జరిగింది: ఆశాదేవి

నా కుమార్తెకు న్యాయం జరిగింది: ఆశాదేవి

ఢిల్లీ: నా కుమార్తెకు న్యాయం జరిగింది. ఆలస్యం అయినా దోషులకు శిక్ష పడటంతో నిర్భయకు న్యాయం జరిగిందని ఆమె తల్లి ఆశాదేవి సంతోషం వ్యక్తం చేశారు. ఆలస్యం అయినా చివరకు న్యాయమే గెలిచింది. దోషులకు ఉరిశిక్షతో నిర్భయ ఆత్మశాంతిస్తుందని తెలిపింది. ఇంతటితో నా పోరాటం ఆగదు. ఇలాంటి కేసుల్లో సత్వర న్యాయం కోసం నా పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. అనంతరం నిర్భయ తండ్రి భద్రినాథ్‌సింగ్‌ మాట్లాడుతూ... నా కుమార్తెకు న్యాయం జరిగింది. అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదు. నిర్భయ కేసు తీర్పు మహిళల విజయమని తెలిపారు. 

ఢిల్లీ నగరంలో 2012 డిసెంబర్‌ 16వ తేదీ రాత్రి 11 గంటలకు నిర్భయపై దోషులైన పవన్‌గుప్తా, అక్షయ్‌కుమార్‌, ముఖేష్‌సింగ్‌, వినయ్‌శర్మ, రామ్‌సింగ్‌లు బస్సులో అత్యంత కిరాతకంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. చావు బతుకుల మధ్య ఉన్న ఆమెను నడరోడ్డుపై పడేసి వెళ్లారు. తీవ్రంగా గాయపడిన నిర్భయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగింది. నిర్భయ ఘటన జరిగిన ఏడేళ్ల మూడు నెలల నాలుగు రోజులకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు అయింది. 


logo