బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 16, 2020 , 16:44:16

అంత‌ర్జాతీయ కోర్టుకు నిర్భ‌య నిందితులు

అంత‌ర్జాతీయ కోర్టుకు నిర్భ‌య నిందితులు

హైద‌రాబాద్‌:  నిర్భ‌య రేప్ కేసుకు సంబంధించిన ముగ్గురు దోషులు.. ఇవాళ అంత‌ర్జాతీయ కోర్టును ఆశ్ర‌యించారు. త‌మ‌కు విధించిన మ‌ర‌ణ‌శిక్ష‌పై స్టే విధించాల‌ని కోరుతూ.. అక్ష‌య్ సింగ్‌, ప‌వ‌న్ గుప్తా, విన‌య్ శ‌ర్మ‌లు అంత‌ర్జాతీయ కోర్టును ఆశ్రయించారు.  ఈనెల 5వ తేదీన ట్ర‌య‌ల్ కోర్టు.. కొత్త డెత్ వారెంట్‌ను జారీ చేసిన విష‌యం తెలిసిందే.  మార్చి 20వ తేదీన ఉద‌యం 5.30 నిమిషాల‌కు నిందితుల‌ను ఉరితీయాల‌ని ఢిల్లీ కోర్టు  ఆదేశించింది. ఆ ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ.. నిందితుల‌ను ఇంట‌ర్నేష‌న‌ల్ కోర్ట్ ఆఫ్ జ‌స్టిస్‌ను ఆశ్ర‌యించిన‌ట్లు తెలుస్తోంది.  మ‌ర‌ణ‌శిక్ష‌ను ర‌ద్దు చేయాల‌ని ఇవాళ ముఖేశ్ సింగ్ పెట్టుకున్న అభ్య‌ర్థ‌న‌ను సుప్రీంకోర్టు ర‌ద్దు చేసింది.  క్ష‌మాభిక్ష పిటిష‌న్ ముగిసింది, ఇప్పుడు నీకు ఎటువంటి అవ‌కాశం లేద‌ని, క్యూరేటివ్ పిటిష‌న్ వ‌ర్తించ‌దు అని సుప్రీంకోర్టు చెప్పింది. 


logo
>>>>>>