గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 14, 2020 , 02:35:19

నా మానసిక స్థితి బాగాలేదు

నా మానసిక స్థితి బాగాలేదు

జైలు అధికారులు వేధించారు.. నిర్భయ దోషి వినయ్‌ కొత్త నాటకం న్యూఢిల్లీ: నిర్భయ కేసులో ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి దోషుల్లో ఒకడైన వినయ్‌ శర్మ మరో కొత్త నాటకానికి తెరతీశాడు. తన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ర్టపతి కోవింద్‌ తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌ మీద విచారణ సందర్భంగా వినయ్‌ శర్మ తరఫు న్యాయవాది ఏకే సింగ్‌ మాట్లాడుతూ.. వినయ్‌ శర్మ మానసిక పరిస్థితి సరిగా లేదని, జైల్లో అతడిని మానసికంగా వేధించడంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని కోర్టుకు తెలిపారు. అయితే, కేంద్రం తరుఫున వాదనలు వినిపించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఈ వాదనల్ని ఖండించారు. దోషి వినయ్‌ శర్మ మానసికంగా రోగ్యంగానే ఉన్నాడని పేర్కొంటూ.. వినయ్‌ శర్మ మానసిక పరిస్థితిపై వైద్యులు ఇచ్చిన నివేదికను కోర్టుకు సమర్పించారు. దీంతో దోషి దాఖలు చేసిన పిటిషన్‌పై  శుక్రవారం తీర్పునిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. మరోవైపు, నిర్భయ కేసు దోషుల్లో మరొకడైన పవన్‌ గుప్తా తరుఫున వాదనలు వినిపించేందుకు ఢిల్లీ కోర్టు ఓన్యాయవాదిని నియమించింది. దోషులకు తాజా డెత్‌ వారంట్‌ జారీ చేయాలన్న ఢిల్లీ ప్రభుత్వం పిటిషన్‌పై సోమవారం వాదనలు వింటామని పేర్కొన్నది విదేశాంగ సంస్థలకు ‘సుష్మ’ పేరు
logo