శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 08, 2020 , 01:58:16

న్యాయం అపహాస్యం కాకుండా జాగ్రత్త పడుదాం

న్యాయం అపహాస్యం కాకుండా జాగ్రత్త పడుదాం

న్యూఢిల్లీ: ఉరిశిక్ష అమలును జాప్యం చేస్తున్న నిర్భయ దోషుల తీరు ‘న్యాయాన్ని అపహాస్యం చేసేలా ఉంది’ అని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. దీన్ని నిలువరించేందుకు అత్యవసరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, పోలీసుల్లో మహిళల భాగస్వామ్యంపై శనివారం ఆమె జాతీయ సదస్సును ప్రారంభించారు. న్యాయాన్ని అపహాస్యం చేసేందుకు చోటు ఉండరాదని స్మృతి ఇరానీ అన్నారు. తీర్పు అమల్లో జాప్యం కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతానన్నారు.


logo