గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 20, 2020 , 14:03:54

నిర్భ‌య దోషి.. ఆ మైన‌ర్ ఎక్క‌డున్నాడు ?

నిర్భ‌య దోషి.. ఆ మైన‌ర్ ఎక్క‌డున్నాడు ?

హైద‌రాబాద్‌: నిర్భ‌య గ్యాంగ్ రేప్‌లో ఓ మైన‌ర్ నిందితుడిగా ఉన్న విష‌యం తెలిసిందే.  అయితే ఎప్పుడో జైలు నుంచి రిలీజైన అత‌ను ఎక్క‌డ ఉన్నాడో తెలిసింది.  ఆ నిందితుడు ద‌క్షిణ భార‌త దేశంలో .. ఎవ‌రూ గుర్తుప‌ట్ట‌ని ప్రాంతంలో ప‌నిచేస్తున్న‌ట్లు అధికారులు చెప్పారు.  నిర్భ‌య గ్యాంగ్ రేప్ కేసులో దోషులుగా ఉన్న న‌లుగుర్ని ఇవాళ ఉరి తీశారు.  మొత్తం ఆరుగురు నిందితుల్లో రామ్ సింగ్ అనే అత‌ను జైలులో ఉరి వేసుకుని చ‌నిపోయాడు.  ఇక ఆ కేసులో నిందితుడిగా ఉన్న మైన‌ర్ ప్ర‌స్తుతం రిలీజై ర‌హ‌స్య జీవితాన్ని గ‌డుపుతున్నాడు.

ఢిల్లీకి 220 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఓ గ్రామానికి చెందిన ఆ మైన‌ర్ ..  గ్యాంగ్ రేప్ జ‌రిగిన రోజున అక్క‌డే ఉన్నాడు.  అత‌ను కూడా క్రూరంగా రేప్‌కు పాల్ప‌డిన‌ట్లు తెలిసింది.  బ‌స్సు ఓన‌ర్ అయిన రామ్ సింగ్‌.. ఆ మైన‌ర్‌కు క్లీన‌ర్‌గా ఉద్యోగం ఇప్పించాడు. 11 ఏళ్ల‌కే ఇళ్లు వ‌దిలి వ‌చ్చిన ఆ మైన‌ర్‌ను రామ్ సింగ్ చేర‌దీశాడు. రేప్ కేసులో దోషిగా తేలిన మైన‌ర్‌ను కొన్నాళ్లు జైలులో ఉంచారు. ఆ త‌ర్వాత అత‌న్ని రిలీజ్ చేశారు. 

అయితే ఢిల్లీకి దూరంగా అత‌న్ని పంపిన‌ట్లు పోలీసులు చెబుతున్నారు.  అత‌ని ఆన‌వాళ్లు ఎవ‌రికీ తెలియ‌దు. ఎప్పుడూ అత‌ని ముఖాన్ని క‌ప్పివేయ‌డం వ‌ల్ల ఆ మైన‌ర్‌ను ఎవ‌రూ గుర్తుప‌ట్ట‌లేరు. ప్ర‌స్తుతం ద‌క్షిణ భార‌త‌దేశంలో అత‌ను ఓ వంట‌వాడిగా జీవితాన్ని గ‌డుపుతున్న‌ట్లు తెలిసింది. జైలులో ఉన్నప్పుడు ఆ మైన‌ర్ వంట నేర్చుకున్నాడు.  అత‌నిపై  పోలీసులు ఎప్పుడూ నిఘా పెట్టి ఉన్న‌ట్లు తెలుస్తోంది.


logo