శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 10, 2020 , 03:43:03

నిర్భయ దోషి మరో ఎత్తుగడ

నిర్భయ దోషి మరో ఎత్తుగడ

న్యూఢిల్లీ, మార్చి 9: ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి నిర్భయ దోషులు చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్‌ శర్మ తాజాగా ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌కు ఒక క్షమాభిక్ష పిటిషన్‌ను పెట్టుకున్నాడు. తన మరణ శిక్షను జీవితఖైదుగా మార్చాలంటూ అభ్యర్థించాడు. కాగా పలు వాయిదాల అనంతరం నిర్భయ కేసులో దోషుల్ని మార్చి 20న ఉరితీయాలంటూ ఢిల్లీ పటియాలా హౌస్‌ కోర్టు ఇటీవల కొత్త డెత్‌ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
logo