శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 21, 2020 , 02:07:04

ఆలస్యమైనా.. న్యాయం జరిగింది

ఆలస్యమైనా.. న్యాయం జరిగింది

- నిర్భయ కుటుంబం హర్షాతిరేకం 

న్యూఢిల్లీ: నలుగురు దోషుల ఉరిపై నిర్భయ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కాస్త ఆలస్యమైనా.. అంతిమంగా తమకు న్యాయం జరిగిందన్నారు. నిర్భయ తల్లిదండ్రులు ఆశాదేవి, భద్రీనాథ్‌ సింగ్‌  శుక్రవారం ఢిల్లీలోని తన ఇంట్లో మీడియాతో మాట్లాడారు. తమ కూతురుకు న్యాయం దక్కిందని, ఇకపై తమ కుటుం  దేశంలోని బాధిత ఆడబిడ్డల కోసం పోరాడుతుందన్నారు. ‘చట్టంలోని లొసుగుల జాబితాను తయారు చేస్తాం. వాటిని తొలిగించేవరకు ఉద్యమిస్తాం’ అని చెప్పారు. ‘రాత్రి దోషుల పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేశాక నేను ఇంటికి వచ్చి నా బిడ్డ ఫొటోను గట్టిగా హత్తుకున్నాను. నీకు న్యాయం దక్కిందమ్మా అంటూ నా బిడ్డకు చెప్పాను’ అని ఆశాదేవి పేర్కొన్నారు. 


logo