శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 20, 2020 , 07:55:20

చివరి కోరిక చెప్పని నిర్భయ దోషులు

చివరి కోరిక చెప్పని నిర్భయ దోషులు

ఢిల్లీ: ఉరితీసే వ్యక్తులను చివరి కోరిక అడగడం ఆనవాయితీ. అలాగే ఈ రోజు తిహార్‌ జైలులో ఉరితీసిన నిర్భయ దోషులు ముకేశ్‌సింగ్‌(32), పవన్‌ గుప్తా(25), వినయ్‌ శర్మ(26), అక్షయ్‌సింగ్‌(31)లను జైలు అధికారులు చివరి కోరిక ఏమిటని అడిగారు. దోషులు ఎలాంటి సమాధారం ఇవ్వకపోవడంతో వారి నుంచి ధృవపత్రాలపై సంతకాలు తీసుకుని ఉదయం 5:30 గంటలకు 17 మంది సిబ్బంది మధ్య ఉరిశిక్ష ప్రక్రియ పూర్తి చేశారు. నలుగురు దోషులు మరణించారని వైద్యాధికారులు దృవీకరించిన తరువాత పోస్టుమార్టం నిమిత్తం డీడీయూ ఆస్పత్రికి తరలించారు. కొద్ది సేపటి క్రితమే మృతదేహాలకు పోస్టుమార్టం ప్రక్రియ ప్రారంభమైంది. శవపరీక్ష అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. తిహార్‌ జైలు బయట పెద్ద ఎత్తున జనం గుమికూడి స్వీట్లు పంచుకున్నారు. 


logo